నేరాల నియంత్రణకే పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.. సీఐ అజయ్ బాబు

by Sumithra |   ( Updated:2022-09-30 10:52:11.0  )
నేరాల నియంత్రణకే పోలీస్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం.. సీఐ అజయ్ బాబు
X

దిశ, దస్తురాబాద్ : ప్రజల రక్షణ కోసం పోలీసు వ్యవస్థ పని చేస్తుందని ఖానాపూర్ సీఐ అజయ్ బాబు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామంలో శక్రవారం పోలిసు కమ్యూనిటి కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో ఉదయం 5.30 గంటల నుండి 7.30 గంటలకు వరకు సివిల్ పోలిసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భాంగా వాహనాల దృవీకరణ పత్రాలను పరిశీలించారు. వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను కట్టించారు.

ఈ కార్యక్రమానికి సీఐ అజయ్ బాబు హజరై ప్రజలకు అవగాహన కల్పించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం, నేరాల నియంత్రణ కోసమే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు కమ్యూనిటి కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వాహనాలు ఉన్నవారు తప్పని సరిగా అన్ని రకాల సరైన దృవీకరణ పత్రాలు కల్గి ఉండాలని, వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. వాహనాలకు తప్పనిసరిగా నంబర్ పేట్లు అమర్చుకోవాలని సూచించారు.

గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలిసులకు సమాచారాన్ని అందించాలన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. గ్రామంలో ముమ్మరంగా చేసిన తనిఖీల్లో 85 ద్విచక్రవాహనాలను, ఒక ఆటో పత్రాలను పరిశీలించారు. మొత్తం 28 వాహనాలపై ఉన్న రూ. 17 వేల 645 రూపాయాల చలాన్లను కట్టించారు. ఈ కార్యక్రమంలో దస్తురాబాద్, పెంబి, ఖానాపూర్ ఎస్ఐలు జ్యోతిమణి, సాయికిరణ్, రజనీకాంత్, ఏఎస్ఐలు, పోలీసు సిబ్బంది, నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed