- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి రాకతో కాంగ్రెస్ నాయకుల అరెస్ట్..
దిశ, కాసిపేట : మోడల్ స్కూల్, హాస్టల్ భవనాలను ప్రారంభించడానికి మండలానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి రావడంతో ముందస్తు జాగ్రత్తగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలానికి కొట్లాడి తెచ్చుకున్న గురుకుల పాఠశాలను దాదాపు 5, 6 సంవత్సరాలుగా అద్దె భవనంలో, అది కూడా బెల్లంపల్లిలో నడిపిస్తున్నారని, తహశీల్దార్ గురుకుల పాఠశాలకి భూమి కేటాయించినప్పటికి ఇప్పటి వరకు నిర్మాణ పనులు మొదలు పెట్టలేదని అన్నారు.కాసిపేట్ మండలంలో ప్రైమరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేనందకు వందల మంది విద్యార్థులు బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల ప్రైవేట్ స్కూల్ కీ వెళ్తున్నారన్నారు.
ఇప్పటికైనా మండలంలోని కాసిపేట్, ముత్యంపల్లి, యాపల్ లో ప్రైమరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇద్దాం అనుకున్నామన్నారు. కానీ పోలీసులు మమ్మల్ని వినతిపత్రం కూడా ఇవ్వకుండా గొంతు నొక్కేస్తున్నారని, తమని అక్రమంగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వెంటనే మండలానికి గురుకుల పాఠశాల కోసం పక్కా భవనంతో పాటు 3 ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ఏర్పాటు చేయాలని మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుండా రాజ్ కుమార్, షేక్ షారుక్, సల్లూరి సామిల్ కుమార్, పల్లపు మహంకాళి, బోయిని సాయికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.