- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రజలు పదేపదే రాకుండా చూడాలి
దిశ, ఆదిలాబాద్ : జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒకసారి ఫిర్యాదు చేస్తే వాటిని వెంటనే పరిష్కరించి పదే పదే ప్రజావాణి కార్యక్రమానికి వారు రాకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆర్జీదారుల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పదేపదే అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు తమ గోడును కలెక్టర్కు వెళ్లబోసుకున్నారు.
దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శాఖల వారీగా చర్చించి సత్వరమే వారి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఇదే విషయంపై అధికారులతో మాట్లాడుతూ ఒకసారి దరఖాస్తు సమర్పించిన ఆర్జీదారుడు తిరిగి రాకుండా చూడాలని కోరారు. మళ్లీ వస్తున్నారంటే సంబంధిత శాఖ అధికారి సమస్యను పరిష్కరించడంలో విఫలం అయినట్లేనని తెలిపారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్యామల దేవి, ఆదిలాబాద్ ఆర్డీఓ వినోద్ కుమార్, జెడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ రవీందర్ రాథోడ్ ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.