రాత్రిపూట తరలిపోతున్న పీడీఎఫ్ బియ్యం

by Naresh |
రాత్రిపూట తరలిపోతున్న పీడీఎఫ్ బియ్యం
X

దిశ, మందమర్రి : మందమర్రి మండల కేంద్రం నుంచి రాత్రిపూట అక్రమంగా పీడీఎఫ్ బియ్యం పలు వాహనాల ద్వారా తరలిపోతున్నాయి. సోమవారం రాత్రి మార్కెట్ ప్రాంతానికి చెందిన రేషన్ డీలర్ షాప్ నుండి నలుగురు వ్యక్తులు, ఒక మినీ వ్యాన్ సహాయంతో ప్రభుత్వ బియ్యాన్ని మాయం చేశారు అంటే అతియోశక్తి కాదు. ప్రభుత్వ రేషన్ సరుకులు ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతుంటే వాటిని కట్టడి చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు ఎంతగానో నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో రేషన్ డీలర్లు కొత్త అవతారం ఎత్తారు. ప్రభుత్వం నుండి వచ్చిన బియ్యాన్ని ప్రజల వద్ద చౌకగా కొనుగోలు చేసి అదే బియ్యాన్ని అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నారు. ఇక్కడ నుంచి కొనుగోలు చేసిన బియ్యం నేరుగా మహారాష్ట్రలోని గడ్చిరోలిలో విక్రయాలు జరుపుతుండడంతో సదరు డీలర్లకు కిలోకు ఏకంగా రూ. 13 రూపాయలు లాభం వస్తున్నట్లు తెలుస్తుంది. దానితో పట్టణానికి చెందిన మెజారిటీ డీలర్లు బియ్యం అక్రమ రవాణాకు సహకరిస్తున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.

యథేచ్ఛగా అక్రమ వ్యాపారం

గత కొంతకాలంగా అక్రమ బియ్యం వ్యాపారం యథేచ్చగా కొనసాగుతోంది. రేషన్ కార్డుదారుల దగ్గర నుంచి రూ. 12 కిలో బియ్యం కొనుగోలు చేసి పలు వాహనాల ద్వారా మహారాష్ట్రలో శిరొంచ గ్రామం డంపులో రూ. 25 అమ్మకాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇలా వెళుతున్న రేషన్ పీడీఎఫ్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాలను దారిలో మునుముందు ఎవరు అడ్డగించారని సమాచారం.

ప్రేక్షక పాత్రలో సంబంధిత అధికారులు…

ఒకవైపు ప్రభుత్వ చౌక ధరల దుకాణం సరుకులు ఇతర ప్రాంతాలకు గుట్టు చప్పుడు కాకుండా వెళుతుంటే స్థానిక సంబంధిత అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో భారీగా సంబంధిత శాఖ అధికారులకు ముడుపులు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.

తమ దృష్టికి రాలేదు మందమర్రి తహసీల్దార్

మండలంలో అక్రమంగా రేషన్ సరుకులు తేలిపోతున్నట్లు తమ దృష్టికి రాలేదని మందమర్రి తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. ఏ రాత్రి వేళైనా తమకు నేరుగా సమాచారం అందిస్తే వాటిపై నిఘా ఏర్పాటు చేసి పట్టుకుంటామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed