- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాగజ్ నగర్ డీఎస్పీని వెంటనే బదిలీ చేయాలి..
దిశ, కాగజ్ నగర్ : కాగజ్ నగర్ డీఎస్పీని వెంటనే బదిలీ చేయాలని సిర్పూర్ నియోజకవర్గం భాజపా నాయకుడు పాల్వాయి హరీష్ బాబు డిమాండ్ చేశారు. సోమవారం కాగజ్ నగర్ పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గంలోని చింతలమానపల్లి బెజ్జూర్ మండలాలలో గత నాలుగైదు రోజుల నుండి వరుసగా పురాతన దేవాలయాల పై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని దుయ్యబట్టారు.
చింతలమానేపల్లి మండలంలోని ముసలమ్మ గుట్ట చిలుకల భీమన్న దేవాలయం పై దాడులు జరిగాయన్నారు. బెజ్జూరు మండలంలోని అందుగుల గూడెం శివమల్లన్న గుట్ట సిద్దేశ్వరుని గుట్టపై దుండగులు దాడి చేసి పురాతన విగ్రహాలను ధ్వంసం చేసి తగలబెట్టారు. దీనిపై పోలీస్ యంత్రాంగం చోద్యం చూస్తుందని అన్నారు. మతిస్థిమితం కోల్పోయిన అణామఖున్ని చూపిస్తూన్నారని. ముఠాగా ఏర్పడి పథకం ప్రకారం దాడులు చేస్తున్న వారిని పట్టుకోకపోగా, వారిని రక్షించే ప్రయత్నం పోలీసు యంత్రాంగం చేస్తున్నట్టు అనుమానం కలుగుతుందన్నారు.
దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులపై జిల్లా ఎస్పీ దృష్టి సారించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏర్పరచి సమగ్ర విచారణ జరిపించి నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. దేవాలయాల పై జరుగుతున్న దాడులను అరికట్టడంలో విఫలమైన కాకజ్ నగర్ డీఎస్పీని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్రా చారి, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యులు జాడి దీపక్, కాగజ్ నగర్ మండల ప్రధాన కార్యదర్శి దెబ్బకి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ నికోడే అర్జున్, టౌన్ ఓబీసీ జనరల్ సెక్రెటరీ అనిల్ కుమార్, రావుల నరేష్, కొండ తిరుపతి, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.