- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులు బాధ్యతాయుతంగా ఎదగాలి : డీసీపీ అఖిల్ మహాజన్
దిశ, మంచిర్యాల : విద్యార్థులందరు క్రమశిక్షణతో విద్యని అభ్యసించి బాధ్యతాయుతంగా ఎదగాలని మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన వాగ్దేవి డిగ్రీ కళాశాల ఫైనల్, సెకండియర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్రెషర్స్ డే పార్టీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ఎఫెక్ట్ తో విద్యకు చాలా ఆటంకం ఏర్పడిందని, కష్టపడి చదివి దానిని అధిగమించాలని అన్నారు.
ఎంజాయ్ అనేది జీవితంలో చిన్న పార్ట్ మాత్రమేనన్నారు. విద్యార్థి జీవితంలో చదువునే ఎంజాయ్ చేయాలని సూచించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కళాశాల కరస్పాండెంటు పెట్టం మల్లేష్ తో కలిసి మెమొంటోలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్స్ శ్రీకర్, రాజు, మనయ్య, ప్రిన్సిపాల్ మహేందర్, ఉపేందర్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.