రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

by Shiva |
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
X

దిశ, గుడిహత్నూర్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినఘటన మండల పరిధిలోని సీతాగొంది గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రాధరపు హన్మండ్లు సోమవారం రాత్రి తన బార్బర్ షాప్ ను మూసివేసి నడుచుకుంటూ నేషనల్ హైవే 44 ను దాటుతున్నాడు. ఈ క్రమంలోనే గుడిహత్నూర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న మోటార్ సైకిల్ హన్మండ్లను వేగంగా ఢీకొట్టింది. దీంతో రాధరపు హన్మండ్లు తీవ్ర గాయాల పాలయ్యాడు. దీంతో ఆతడిని వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో రిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.

Advertisement

Next Story