అను'మతి' లేని వైద్య సేవలు

by Sumithra |   ( Updated:2022-10-10 14:53:07.0  )
అనుమతి లేని వైద్య సేవలు
X

దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో అనుమతులు లేకుండా పలు ఆసుపత్రిలు సేవల పేరుతో ధనార్జనకు పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా అనుమతి లేని ఆసుపత్రులపై తూతూ మంత్రంగా జిల్లా అధికార యంత్రాంగం తనిఖీలు నిర్వహిస్తున్నారని వాదనలు వస్తున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రం ఏర్పడ్డాక జిల్లా ఓ మెడికల్ హబ్ గా మారింది అనక తప్పడం లేదు. జిల్లాలో ప్రస్తుతం 228 ఆసుపత్రులు, పదుల సంఖ్యకు మించి ల్యాబ్, డయాగ్నోసిస్ లు ఉన్నాయి. జిల్లాలో వందల సంఖ్యలో ఆసుపత్రిలో ఉండగా వైద్య అధికారులు కేవలం తొంబై ఆసుపత్రులపై మాత్రమే తనిఖీలు నిర్వహించడంపై పలు అనుమానాలకు దారి తీస్తోంది. మిగిలిన ఆసుపత్రి పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని అసలు చర్యలు తీసుకుంటారా..? లేదా..? అని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

నస్పూర్ మున్సిపాలిటీలో అనుమతి లేని డెంటల్ ఆసుపత్రులు

జిల్లాలోని నస్పూర్ లో ఎలాంటి అనుమతులు లేకుండా కొన్ని ఆసుపత్రులు వైద్య సేవలు అందిస్తున్న చూసి చూడనట్టుగా వైద్యాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలకు దారితీస్తుంది. ఆస్పత్రి వైద్యులు గతంలో తను గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ అంటూ చలామణి అవుతున్న నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ గా ప్రభుత్వ రంగంలో వైద్య సేవలు అందించినట్లు ప్రచారం చేసుకుంటూ ప్రస్తుతం నస్పూర్ మున్సిపాలిటీలో అనుమతి లేకుండా డెంటల్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు.

అనుమతులు లేని ఆసుపత్రుల పై చర్యలు తీసుకుంటాం : జిల్లా వైద్య అధికారి సుబ్బారాయుడు

మంచిర్యాల జిల్లాలో అనుమతులు లేని ఆసుపత్రులపై త్వరలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు తెలిపారు.

Advertisement

Next Story