అధికారులు అంకితభావంతో పని చేయాలి : మంత్రి సీతక్క

by Aamani |   ( Updated:2024-07-01 10:02:33.0  )
అధికారులు అంకితభావంతో పని చేయాలి :  మంత్రి సీతక్క
X

దిశ,ఆదిలాబాద్ : అంకితభావంతో అధికారులు పనిచేసే ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శిశు సంక్షేమ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.అందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేసి....జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రానున్న రోజుల్లో విస్తృతంగా వర్షాలు కురిసి అనేక వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ఆ పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తో కలిసి నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో అధికారులకు ఆయా శాఖల పరంగా జిల్లా ప్రజలకు అందించాల్సిన సేవలు, సమస్యల పరిష్కారం పై పలు సూచనలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విది నిర్వహణలో అధికారులు అంకిత భావంతో పని చేయాలని కోరారు. మానవత్వంతో...తక్కువ పనిచేసి ఎక్కువ ఫలితం వచ్చేలా పని చేయాలని అన్నారు. అధికారులు తమ స్థాయిలో సమస్యలు పరిష్కరించాలని,వాటికి ప్రజా ప్రతినిధుల పై ఆధార పడకుండా సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటూనే, క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ విజిట్ చేయడం వల్ల స్థానికంగా ఉన్న సమస్యలు తెలుస్తాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఉద్యోగుల సమస్యలు సైతం పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని,అందుకు మీ ఉద్యోగంలో అంకితభావంతో పనిచేసే మంచి గుర్తింపు తీసుకు రావాలని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో అనుకోని పరిస్థితులు ఏర్పడినప్పుడు కొంత ఇబ్బంది ఉన్నా వాటిని అధిగమించి ప్రజలకు సేవ చేయడం వల్ల ఎంతో గుర్తింపు ఉంటుందని తెలిపారు.ఒక నిబంధనలకు విరుద్ధంగా పని చేయకుండా,దానికి కట్టుబడి ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడకుండా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా,పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు.

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ కొన్ని కోట్ల రూపాయలతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో మంచి నీటి కోసం కేటాయించిన, అవి నేడు వృథాగా పోతున్నాయని అన్నారు.ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అనేక సమస్యలతో సతమవుతున్నారని ఆ పరిస్థితి రాకుండా చూడాలని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు స్థానికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని,వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించడం తో పాటు ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న పనులకు నిధులను విడుదల చేసి,రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా నిధులు సకాలంలో విడుదల చేసి పెండింగ్ పనులు పూర్తయ్యేలా చూడాలని కోరారు. ఇందులో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, డీ ఎఫ్ ఓ జీవన్ ప్రశాంత్ పాటిల్,అదనపు కలెక్టర్ శ్యామల దేవి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed