తల్లిపాలపై అవగాహన కల్పించాలి

by Sridhar Babu |   ( Updated:2024-09-13 14:26:14.0  )
తల్లిపాలపై అవగాహన కల్పించాలి
X

దిశ, ఆసిఫాబాద్ : పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణమాసంను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్, తివారీతో కలిసి శిశు సంక్షేమ శాఖ. పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యశాఖలతో పాటు పలుశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30వరకు జిల్లాలో చేపట్టనున్న పోషణ మాసం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. తల్లిపాలపై అవగాహన కల్పించాలని కోరారు. మానసిక, శారీరక ఎదుగుదల తక్కువగా ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మెనూ ప్రకారం గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందించాలని, రోజువారీ మెనూ వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని ఆదేశించారు. అంగన్వాడీలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్వహణ తీరును పరిశీలించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed