న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి

by Sridhar Babu |
న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి
X

దిశ, ఆదిలాబాద్ : జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. డిసెంబర్ 31న మద్యం అతిగా సేవించడం, వాహనాలపై ఓవర్ స్పీడ్ గా వెళ్లడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం వంటివి చేయరాదన్నారు. మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 31 డిసెంబర్ కోసం 30 ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు.

యువత మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా అర్ధరాత్రి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి నిరంతరంగా గస్తీ నిర్వహిస్తామన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100 కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. వేడుకలను రాత్రి 12 : 30 నిమిషాల వరకు పూర్తి చేసుకోవాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, డీజేలకు అనుమతులు లేవని పేర్కొన్నారు. ప్రజలకు, పోలీసు సిబ్బందికి, అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed