నూతన 33/11 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే బాల్క సుమన్..

by Sumithra |
నూతన 33/11 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే బాల్క సుమన్..
X

దిశ, రామకృష్ణాపూర్ : పురపాలక ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చెందడమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలల్లో భాగంగా సోమవారం క్యాతన్ పల్లి రామకృష్ణాపూర్ పట్టణంలో విద్యుత్ ఉత్సవాలను పురస్కరించుకుని శివాజీ నగర్ లో నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పాలకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్‌ సంక్షోభం వచ్చి తెలంగాణ అంధకారంలో ఉండిపోవాల్సి వస్తుందన్న సమైక్య పాలకుల మాటలను సీఎం కేసీఆర్‌ పటాపంచలు చేసి దేశంలో ఎక్కడ లేనివిధంగా రైతులకు ఉచిత విద్యుత్‌ అందిస్తూ విద్యుత్‌ రంగంలో రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. 1.90 కోట్ల నిధులతో నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్ ద్వారా పుర పరిధిలోని ఏజోన్, బిజోన్, క్యాతనపల్లి, గద్దెరాగడి, అమరవాది ఏరియాలో సుమారు 12,263 గృహ, వాణిజ్య, వ్యవసాయ మొదలైన కనెక్షన్లకు నాణ్యమైన విద్యుత్ ను అందించనున్నారన్నారు.

సబ్ స్టేషన్ లేని సమయంలో క్యాతన్ పల్లి పురపాలకంలో విద్యుత్ ఆటంకాలు ఏర్పడితే మంచిర్యాల రాజీవ్ నగర్, ఎసీసీ సబ్ స్టేషన్, అందుగులపేట సబ్ స్టేషన్, లేదా మందమర్రి పాలచెట్టు నుంచి విద్యుత్ సరఫరా జరిగేది ఇప్పుడు అలాంటి సమస్యలు ఉండవని అన్నారు. రామకృష్ణాపూర్ 33/11 కేవీ సబ్ స్టేషన్ లో ఇప్పటికే మూడు ఫీడర్ల నిర్మాణం పూర్తయిందని మరో రెండు ఫీడర్ల పనులు త్వరలోనే పూర్తి చేసి పుర ప్రాంతంలో విద్యుత్ అంతరాయ పవర్ బ్రేక్ డౌన్ మొదలైన సమస్యలకు పూర్తిగా చెక్ పెడతాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు ఎస్.ఇ శేషారావు,డి .ఇ ఎండీ ఖైసర్, డీఈ ఎంఆర్పి పెద్ది రాజాం, ఏ.డి జయకృష్ణ, పుర వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ఇంచార్జ్ గాండ్ల సమ్మయ్య, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story