- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో 8 పీహెచ్ సీ లకు జాతీయ గుర్తింపు..
దిశ ప్రతినిధి, నిర్మల్ : తెలంగాణలో 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపును జారీ చేస్తూ కేంద్రఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరణ పత్రాలను పంపింది. నేషనల్ క్వాలిటీ అష్యోరెన్స్ స్కీమ్ కింద ఈ 8 పీహెచ్ సీ లకు జాతీయ గుర్తింపు దక్కింది. ఆస్పత్రుల నిర్వహణ, స్వచ్ఛత, రోగులకు సేవలు, సిబ్బంది, అధికారుల పర్యవేక్షణ, మందుల పంపిణీ, రికార్డుల నిర్వహణ, బయో వేస్ట్ మేనేజ్మెంట్ వంటి వివిధ అంశాలపై కేంద్ర ఆరోగ్య బృందాలు చేపట్టిన సర్వే మేరకు రాష్ట్రంలో 8 పీహెచ్ సీ లకు జాతీయగుర్తింపు దక్కింది.
నిర్మల్ జిల్లా ముజిగి, కొత్తగూడెం జిల్లా మోవాన్ పల్లి బంజారా, ఎర్రగుంట్ల, హన్మకొండ జిల్లా ధర్మసాగర్, మహబూబ్ బాద్ జిల్లా గంధంపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట ఖమ్మంజిల్లా బోనకల్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జాతీయ అవార్డుకు ఎంపికయ్యాయి. కాగా నిర్మల్ జిల్లా ముజిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జాతీయస్థాయి ఎన్ క్వాస్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ధనరాజ్, ఉపవైద్య అధికారి డాక్టర్ రాజేందర్, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రీనివాస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ నిఖిల రాణి సంతోషం వ్యక్తం చేశారు.