- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూర్తి పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి : జిల్లా కలెక్టర్ రాజార్షి షా
దిశ, ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సెక్టోరల్ అధికారులు ఏవీఎంలు వివిధ అంశాలపై పూర్తి పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజార్షి షా అధికారులను సూచించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెక్టోరల్ అధికారులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి మాట్లాడారు. సెక్టోరల్ అధికారులు ఈవీఎంలు వివిధ పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన అంశాలపై పూర్తి పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలని ఆదేశించారు. సెక్టోరల్ ఆఫీసర్ రిటర్నింగ్ అధికారులకు క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికల పక్రియను, ఎన్నికల నియమ నిబంధనలు లోబడి పని చేయాలని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా నిర్వహించారో అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిర్వహించాలని తెలిపారు. అన్ని అంశాల పై ట్రైనర్ లక్ష్మణ్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరల్, రెవెన్యూ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.