కోరం లేక మున్సిపల్ బడ్జెట్ సమావేశం వాయిదా..

by Sumithra |
కోరం లేక మున్సిపల్ బడ్జెట్ సమావేశం వాయిదా..
X

దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం నిర్వహించిగా సమావేశానికి మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, మున్సిపల్ సిభంది మాత్రమే హాజరయ్యారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, ప్రతిపక్షం కాంగ్రేస్, బీజేపీ కౌన్సిలర్లు హాజరుకాకపోవడంతో మున్సిపల్ బడ్జెట్ సమావేశాలు వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రత్నాకర్ రావు తెలిపారు. ఈ నెల 18వ తేదీ ఉన్నమున్సిపల్ బడ్జెట్ సమావేశం నిర్వహించగా కౌన్సిలర్లు హాజరు కాకపోడంతో వాయిదా వేశామని మళ్ళీ ఈ రోజు సమావేశానికి కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో వాయిదా వేశామని, జిల్లా కలెక్టర్ ఆదేశాలమేరకు మల్లీ సమావేశం ఏర్పాటు చేస్తామని కమిషనర్ తెలిపారు.

ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదనే కౌన్సిలర్లు మూకుమ్మడిగా గైర్హాజరు..

ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన బడ్జెట్ సమావేశానికి పాలక ప్రతిపక్ష కౌన్సిలర్లు మూకుమ్మడిగా హాజరు కాకపోవడానికి మున్సిపాలిటీ పాలక వర్గం కారణం అని ప్రతిపక్షాలు మున్సిపల్ ప్లోర్ లీడర్ రాజుర (చిన్నం) సత్యం ఆరోపించారు. పాలక వర్గం ఏర్పడినప్పటి నుండి ఇప్పటికి 3 సార్లు బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం జరిగిందని, అందులో చూపించిన ఆదాయం కాని, వ్యయం కాని, కాగితాలకె పరిమితం అయినవి అని అన్నారు. పొంతన లేని బడ్జెట్ మరోసారి తయారు చేయడంతో అందరూ కౌన్సిలర్లు దాన్ని బహిష్కరించారని ఆయన తెలిపారు. పట్టణంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని పందులు, కోతులు, కుక్కల దాడిలో ఎందరో గాయలపాలవుతున్న వాటి పై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. పట్టణంలో పాలక వర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు పట్టణంలో దుమ్ము ధూళి తప్ప అభివృద్ధి శూన్యం అని అన్నారు. కాబట్టి నేటి సమావేశాన్ని బహిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుగలవత్ కిశోర్ నాయక్, బిజేపీ కౌన్సిలర్ నాయిని స్రవంతి సంతోష్, అఫ్రీన్ బేగం అమనుల్లా ఖాన్,పౌజియ షబ్బీర్ పాషా లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed