చిరుత పులి సంచారం.. అప్రమత్తమైన అటవీ అధికారులు

by Aamani |
చిరుత పులి సంచారం.. అప్రమత్తమైన అటవీ అధికారులు
X

దిశ,సారంగాపూర్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం సయ్యద్రి అడవులలో చిరుత పులి సంచరించిన నేపథ్యంలో అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నాలుగు రోజుల నుంచి పశువులు మేకలపై చిరుత,పెద్ద పులి దాడి చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరించి పశువులను తినే వార్త స్థానికంగా అలజడి రేపింది. దీంతో నిజానిజాలను తెలుసుకునేందుకు సోమవారం అటవీశాఖ అధికారులు ఉదయం నుంచి పర్యవేక్షణ గాలింపు చర్యలు చేపట్టారు. ఒకచోట అనుమానాస్పదంగా ఉన్న ఒక పగ్‌ మార్క్‌ ను చూసి అది ఏ జంతువు కు సంబంధించినది అనే విషయాన్ని తెలుసుకుని అది పెద్దపులి ఆనవాలుగా గుర్తించారు.

అంతేకాక ఈ ప్రాంతాలతో పాటు అక్కడక్కడ ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుతపులి సంచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అడవికి దగ్గర్లో ఉన్న తండా వాసులు అడవి లోపలికి పశువులను మేపడానికి వెళ్లొద్దని అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ శరవణన్, IFS CHIEF CONSERVATOR OF FOREST బాసర సర్కిల్ ,శ్రీమతి షేక్ ఆదం నాగిని భాను DFO ,రామ కృష్ణ FRO నిర్మల్, వేణు గోపాల్ FRO టాస్క్ ఫోర్స్, MD నజీర్ ఖాన్ DYRO, సంతోష్ DYRO, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story