- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిషన్ భగీరథ ట్యాంకులో కోతి మృతదేహం
దిశ, భైంసా : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం నిగ్వ గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ లో బుధవారం కోతి కళేబరాన్ని గ్రామస్తులు గుర్తించారు. కొన్ని రోజులుగా ఇవే నీటిని సరఫరా చేస్తున్న అధికారుల తీరుపై అక్కడి జనాలు మండిపడుతున్నారు. శుద్ధ నీటిని సరఫరా చేయాల్సిన అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు.
ఇప్పటికే వాతావరణం సరిగా లేక రోగాల బారిన పడుతున్న తమకు అధికారుల నిర్లక్ష్యంతో మళ్లీ కలుషిత నీరు తాగించి రోగాల బారిన పడేటట్లు చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. అయితే కుళాయి ద్వారా వచ్చిన నీరు దుర్గంధం రావడంతో అనుమానం వచ్చి ట్యాంక్ లో చూడగా కోతి కళేబరం దర్శనమిచ్చింది.
కళేబరాన్ని గుర్తించి తీశాం : ఎంపీడీఓ
కోతి కళేబరాన్ని తీసి బ్లీచింగ్ పౌడర్ తో ట్యాంకును శుద్ధి చేశాం. జాలీని బిగించి ఎలాంటి వ్యర్థాలు పడకుండా చర్యలు తీసుకున్నాం.