- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గులాబీ తమ్ముళ్ళను కంటికి రెప్పలా కాపాడుకుంటా..
దిశ, బెల్లంపల్లి : టీఆర్ఎస్ పార్టీకి పునాదిలాంటి గులాబీ తమ్ములను కంటికి రెప్పలా కాపాడుకుంటానని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామశివారులో మంగళవారం జరిగిన టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి పునాదిలాంటి వారని, నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం చేపట్టినసంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ పైన బీజేపీ, కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు రెట్టింపు కావాలంటే రానున్న ఎన్నికల్లో మళ్లీ బెల్లంపల్లిలో గులాబీ జెండాను ఎత్తి పట్టాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని, కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణిగుంట్ల ప్రవీణ్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, బెల్లంపల్లి ఎంపీపీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి, ఆకెనపల్లి, బూదాకలాన్, గురిజాల ఎంపీటీసీలు సుభాష్ రావు, అంకు, శకుంతల లంబడితాండ, బూదాకలాన్, చంద్రవెల్లి, బూదాకూర్ద్, కన్నాల, సోమగూడెం, లింగాపూర్, అంకుశం గ్రామపంచాయతీల సర్పంచ్లు రాయమల్లు, లక్ష్మీ, అశోక్ గౌడ్, కృష్ణమూర్తి, స్వరూప, ప్రమీలగౌడ్, వెంకటేష్,రాజమోగిలి, ఎ ఎంసీ డైరెక్టర్ రవి, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి లక్ష్మణ్, మండల అధ్యక్షుడు గణేష్ గౌడ్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రవితేజ, మండల అధ్యక్షుడు మహేందర్, ఉపాధ్యక్షుడు కిరణ్ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.