నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం.. ఎమ్మెల్యే బాల్క సుమన్..

by Sumithra |
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం.. ఎమ్మెల్యే బాల్క సుమన్..
X

దిశ, చెన్నూర్ : చెన్నూర్ నియోజకవర్గాన్ని అన్నిరంగాలలో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. 1.90 లక్షల రూపాయల నిధులతో పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న 33/11 విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెన్నూరు పట్టణానికి ప్రస్తుతానికి ఒకే సబ్ స్టేషన్ తోటి విద్యుత్ సప్లై జరుగుతుందని ప్రజల కష్టాలను గుర్తించి అదనంగా మరో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని, దాదాపుగా అక్టోబర్ నెల వరకు విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం పూర్తవుతుందని ఆయన అన్నారు.

ఈ సబ్ స్టేషన్ నిర్మాణంతో పట్టణంలో నిరంతరాయంగా విద్యుత్ సప్లైతో పాటు ఎటువంటి లో వోల్టేజ్ సమస్యలు ఉండవని ఆయన అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యుత్ విజయోత్సవాల సందర్భంగా సబ్ స్టేషన్ నిర్మాణ పనులు ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో వేలకోట్లతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని రాబోయే రోజులలో కూడా పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి పట్టణ ప్రజల మెప్పు పొందుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గం, టీఆర్ఎస్ నాయకులు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story