- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ తీగలు తగిలి మిర్చి వ్యాన్ కు అగ్నిప్రమాదం..
దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల జాతీయ రహదారి వద్ద నిలిపి ఉన్న మిర్చీవ్యాన్ కు విద్యుత్ తీగలు తగిలి మంటలు అంటుకున్న సంఘటన శనివారం కలకలం రేపింది. సంఘటన వివరాల్లోకెళితే ఆంధ్రప్రదేశ్ నందిగాం నుంచి నాగపూర్ కు మిర్చి లోడుతో వెళ్తున్న వ్యాన్ బెల్లంపల్లిలో అగ్ని ప్రమాదానికి గురై 30 బస్సుల వరకు కాలిపోయాయి. డ్రైవర్, క్లీనర్ కన్నాల ప్రధాన రహదారి వద్ద భోజనం చేసి అదే వ్యాన్లు సేద తీరుతూ నిద్రలోకి జారుకున్నారు. ఇదే క్రమంలో వ్యాను పైన ఉన్న విద్యుత్తీగలు మిర్చి బస్తాలకు అంటుకొని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ సంఘటనను గమనించిన వ్యాపారులు, స్థానికులు వ్యాన్ లో పడుకున్న డ్రైవర్ క్లీనర్ వద్దకు వెళ్లి నిద్రలో ఉన్న వారినిలేపారు. అప్పటికే మిర్చి బస్తాలకు అంటుకున్న మంటలు చెలరేగాయి. స్థానికుల చొరవతో డ్రైవర్, క్లీనర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మిర్చిలోడు వ్యాన్ అక్కడి నుంచి కొంత దూరం తీసుకువెళ్లి నిలిపివేసి వెంటనే అగ్ని మాపక కేంద్రానికి ఫోన్ చేసి చెప్పారు. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి హుటాహుటిన వచ్చి మంటలను ఆరిపారు. అప్పటికే మిర్చి బస్తాలు కొన్ని కాలిపోగా వ్యాన్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటన నుంచి డ్రైవర్, క్లీనర్ క్షేమంగా బయటపడ్డారు.