- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలోనే నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు పూర్తి : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : అన్ని హంగులతో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనాన్ని తీర్చిదిద్దాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన నిర్మాణ సముదాయాన్ని ఆర్ అండ్ బీ శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ఈఎన్సీ గణపతి రెడ్డితో కలిసి పరిశీలించారు.
ప్రాంగణమంతా కలియతిరుగుతూ సుందరీకరణ, గార్డెనింగ్, అప్రోచ్ రోడ్డు, హెలి ప్యాడ్ తదితర పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తిచేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. నవంబర్ 30లోగా భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.
డిసెంబర్ నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మంచిర్యాల రోడ్డు నుంచి వయా రెడ్డి గార్డెన్స్ కలెక్టరేట్, బంగల్ పేట్ మహాలక్ష్మి ఆలయం, బంగల్ పేట్ చెరువు మీదుగా విశ్వనాథ్ పేట్ వరకు 100 ఫీట్ల రహదారి నిర్మాణ పనులకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.