నాను మహారాజ్ జాతర ఉత్సవానికి హాజరైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

by Kalyani |   ( Updated:2023-01-14 13:52:35.0  )
నాను మహారాజ్ జాతర ఉత్సవానికి హాజరైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ, సారంగాపూర్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని పొట్యా గ్రామ పంచాయతీ పరిధిలోని బాండ్రేవు తండాలో శ్రీ నాను మహారాజ్ జాతర ఉత్సవం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 30వ వార్షికోత్సవ జాతరకు శనివారం రాష్ట్ర దేవాదాయ న్యాయ అటవీ శాఖ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. నాను మహారాజ్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు వచ్చే జాతరకు పెద్ద సంఖ్యలో గిరిజన తండావాసులు చుట్టుపక్కన గ్రామాల ప్రజలు ఈ జాతరకు హాజరై జాతర కమిటీ నిర్వహిస్తున్న క్రీడలలో పాల్గొనడం ఒకరినొకరు కలుసుకోవడం ఆనందంగా ఉంటుందన్నారు. క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. నాను మహారాజ్ మందిర నిర్మాణానికి రూ. 28 లక్షలతో నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. వచ్చే సంవత్సరం నాటికి పూర్తవుతుందని చెప్పారు. గిరిజనులకు త్వరలోనే పోడు భూముల పట్టాలు వస్తాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నల్ల వెంకటరామిరెడ్డి, సారంగాపూర్ మండల ఎంపీపీ అట్ల మహిపాల్ రెడ్డి, అడేల్లీ దేవస్థానం చైర్మన్ ఐటీ చందు, బీఆర్ఎస్ కన్వీనర్ మాధవరావు, డీసీసీబీ డైరెక్టర్ ఐరా నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాథోడ్ దత్తురాం, ఎక్స్ అడేల్లీ టెంపుల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ జాదవ్ సురేఖ కైలాష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story