సీఎంను మురిపిస్తేనే జిల్లాకు మరిన్ని నిధులు.. బీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

by Javid Pasha |
సీఎంను మురిపిస్తేనే జిల్లాకు మరిన్ని నిధులు.. బీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : జూన్ 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ వస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్ ప్రారంభోత్సవంతోపాటు బహిరంగ సభ విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. సీఎం పర్యటన విజయవంతం, ఏర్పాట్లపై ఆయన బిజీ బిజీగా ఉన్నారు. ఉదయం నుంచి పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపారు. కలెక్టరేట్ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ క్రమంలో పనుల నిర్వహణపై కలెక్టర్ వరుణ్ రెడ్డితో పలు దఫాలు మంత్రి సమీక్షించారు.

కాగా లక్షకు తగ్గకుండా జనంతో బహిరంగ సభ నిర్వహించేందుకు మంత్రితోపాటు ముఖ్యనేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జూన్ 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ వస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్ ప్రారంభోత్సవంతోపాటు బహిరంగ సభ విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. సీఎం పర్యటన విజయవంతం, ఏర్పాట్లపై ఆయన మంగళవారం బిజీ బిజీగా ఉన్నారు. ఉదయం నుంచి పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు జరిపారు. కలెక్టరేట్ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

పార్టీ నేతలు కార్యకర్తలతో సమీక్ష..

కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి హాజరవుతున్న బహిరంగ సభ నేపథ్యంలో నిర్మల్ నియోజకవర్గం భారత్ రాష్ట్ర సమితి నేతలు కార్యకర్తలతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం సాయంత్రం సమావేశం అయ్యారు. పట్టణంలోని దివ్య ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం సభ విజయవంతంపై నేతలు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని ఆయా మండలాలతో పాటు పట్టణంలోని మున్సిపల్ వార్డుల వారీగా ప్రజాప్రతినిధులు పార్టీ బాధ్యులు ప్రణాళిక ప్రకారం జనాన్ని తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు లక్ష మందికి తగ్గకుండా జనం హాజరయ్యేలా నేతలు కార్యకర్తలు సమిష్టిగా పాటుపడాలన్నారు. నేతలకు వాహనాల ఇన్చార్జి తో పాటు సభకు వచ్చి వెల్లే సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై కూడా మంత్రి పలు సూచనలు చేశారు.

జనం లక్షకు తగ్గొద్దు

నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సందర్భంగా సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నిర్వహించనున్న బహిరంగ సభ లక్ష మందికి తగ్గకుండా చూడాలని మంత్రి సూచించారు నిర్మల్ నియోజకవర్గం నుంచి 50,000 ఖానాపూర్ ముధోల్ నియోజకవర్గం నుంచి 25 వేల చొప్పున జనం తరలివస్తారని అంచనా వేస్తున్నారు. జిల్లాకు మరిన్ని నిధులు భారీగా రావాలంటే సీఎం సభను జయప్రదం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి నేతలతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి రేఖ నాయక్ తో పాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకోవాలని సూచించారు సీఎం పర్యటన పూర్తయ్యేదాకా అధికార యంత్రాంగం తో పాటు అధికార పదవుల్లో ఉన్న నేతలు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed