బీజేపీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర

by Sumithra |
బీజేపీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర
X

దిశ, బెజ్జూర్ : సిర్పూర్ నియోజకవర్గంలోని వంతెనలు పూర్తి చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో శనివారం మహాపాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రను బీజేపీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. కాగజ్ నగర్ మండలంలోని అంద్వెల్లి వంతెన కూలిపోవడంతో దహగాం మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వంతెనను వెంటనే పూర్తిచేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ పాదయాత్ర పెంచికలపేట మండలంలో ప్రారంభమై, దహెగాం, కాగజ్ నగర్ మండలాల మీదుగా అంద్వెల్లి వరకు చేరుకుంటుంది. ఈ పాదయాత్రలో భీజేపీ నాయకులు పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు గోళం వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, సింగల్ విండో చైర్మన్ తిరుపతి గౌడ్, మండల అధ్యక్షులు ధోని శ్రీశైలం, రామ్ టెంకి సురేష్, భాస్కర్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story