హామీలు నెరవేర్చేంత వరకు నిలదీద్దాం

by Sridhar Babu |
హామీలు నెరవేర్చేంత వరకు నిలదీద్దాం
X

దిశ, కుబీర్ : ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు ప్రభుత్వాన్ని నిలదీద్దామని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. కుబీర్ మండలంలోని ధార్ కుబీర్ గ్రామంలో రూ.54 లక్షల పంచాయతీరాజ్ నిధులతో మంజూరైన వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే రామారావు పటేల్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి భూమి పూజ చేశారు. స్థానికులతో మాట్లాడుతూ గ్రామంలోని అభివృద్ధి పనులకు తన వంతు కృషి చేస్తారన్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరు అబద్ధాలు, 66 మోసాలు అన్న చందంగా పాలన కొనసాగుతుందని ప్రభుత్వం పై మండి పడ్డారు.

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2500, రూ.4000 పెన్షన్, ఇందిరమ్మ ఇండ్లు, కొత్తరేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లడికి బహన్ పథకం ద్వారా ప్రతి మహిళకు రూ.1500 చొప్పున ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్ బాబు, బోయిడి విట్టల్, మోహన్, గులాబ్ నాయక్, పడిపెల్లి గంగాధర్, యేశాల దత్తాత్రి, కందుర్ చిన్నసాయి, భారతీయ జనతా పార్టీ జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed