మరాఠ్వాడలోనూ గులాబీ జెండా ఎగరేద్దాం..

by Sumithra |
మరాఠ్వాడలోనూ గులాబీ జెండా ఎగరేద్దాం..
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : మ‌హారాష్ట్రలో త్వరలోనే జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించార‌ని, ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో కో ఆర్డినేట‌ర్ల‌ను నియ‌మించి పార్టీ విస్తరణకు పక్కా ప్రణాళికలతో ముందుకుసాగుతున్నామ‌ని పేర్కొన్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ షెడ్యూల్ వ‌ర‌కు అభ్య‌ర్థులను ఎంపిక చేసి, ప్ర‌చారాన్ని ప్రారంభిస్తామ‌న్నారు.

తెలంగాణ‌లో అమ‌లవుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయాల‌ని ఆయా రాష్ట్రాల ప్ర‌జ‌లు బ‌లంగా కోరుకుంటున్నార‌ని, ప్ర‌జ‌ల అకాంక్ష మేర‌కు బీఆర్ఎస్ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి స‌మ‌య‌త్తం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. సీయం కేసీఆర్ నాందేడ్ స‌భ త‌ర్వాత మ‌హారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి అనూహ్య మ‌ద్ధ‌తు ల‌భిస్తుంద‌ని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ తొలినాళ్ళ‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో విజ‌య‌దుంధుభి మోగించింద‌ని, ఆదే స్పూర్తితో మ‌హారాష్ట్ర స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గులాబీ జెండా రెప‌రెప‌లాడ‌టం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

రాంరావ్ మహారాజ్ సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం..

రాంరావ్ బాపూ మహారాజ్ గిరిజ‌నుల ఐక్య‌త కోసం ఆహ‌ర్నిశ‌లు కృషి చేశారని, ఆయ‌న చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శ‌నివారం కిన్వ‌ట్ తాలూకాలో దయాళ్ దన్నూర్ గ్రామంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాంరావ్ బాపూ మహారాజ్ విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఆధ్యాత్మిక పీఠాధిప‌తిగా ధ‌ర్మప‌రిర‌క్ష‌ణ, బంజారాల శ్రేయ‌స్సు కోసం విశేష సేవ‌లందించార‌ని తెలిపారు. స‌మాజంలో అంద‌రూ చ‌దువుకుని క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెల‌గాల‌ని, ఆత్మ‌గౌర‌వంతో జీవించాల‌ని ఆయ‌న బోధించార‌ని పేర్కొన్నారు. మంత్రి వెంట సారంగాపూర్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఆశ్రిత శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed