- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆదివాసీ హక్కుల సాధనకు పోరాడదాం
దిశ, ఇంద్రవెల్లి : జల్, జంగల్ ,జమీన్ నినాదంతో ఆదివాసీ హక్కుల కోసం పోరాడి అసువులు బాసిన కొమురం భీం జీవితం ఒక స్ఫూర్తిదాయకమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఆదివారం మండలంలోని హిరపూర్ గ్రామంలో కొమురం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు కొమురం భీం మనుమడు సోనేరావ్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు పూర్క బాపూరావ్ తో కలిసి భీం విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొమురం భీంను స్ఫూర్తిగా తీసుకొని ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గు, తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి నగేష్, మండల అధ్యక్షులు పూర్క చిత్రు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముకడే ఉత్తం, రాయిసెంటర్ సార్మెడిలు మెస్రం చిన్ను, తోడసం నాగోరావ్, మెస్రం నగనాథ్ పాల్గొన్నారు.