- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వంపై కేటీఆర్ తప్పుడు ప్రచారం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
దిశ,ప్రతినిధి నిర్మల్ : గతంలో 10 ఏళ్ళ పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రైతుల సంక్షేమానికి ఏం చేసిందో కేటీఆర్ సమాధానం చెప్పాలని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని అన్నారు. రైతులపై లాఠీఛార్జ్ జరిగిందంటూ...కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఆ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్నారు. రైతులను నమ్మించి మోసం చేసి జైలుకు పంపింది మీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఎరువులను అందజేస్తామని మోసం చేసిందని, రైతుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదన్నారు. కేటీఆర్ ప్రభుత్వంపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.రైతుల గురించి ఆలోచించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ఆగస్టు 15 లోపు రైతుల రుణాన్ని మాఫీ చేస్తామన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పోలీసు, వ్యవసాయ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నా నియోజకవర్గంలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.