ఖానాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తా : Bhukya Johnson Naik

by Shiva |   ( Updated:2023-08-29 14:26:17.0  )
ఖానాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తా : Bhukya Johnson Naik
X

దిశ, జన్నారం : ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తానని అభ్యర్థి భూక్య జాన్సన్ నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మొదటిసారిగా పాల్గొని ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, మంత్రి కేటీఆర్ ప్రోత్సహంతో ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్నానని తెలిపారు. కార్యకర్తలు ఐకమత్యంగా ఉండి తన గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఎల్లప్పుడు కార్యకర్తలు అందుబాటులో ఉండి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని అన్నారు.

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి గ్రామానికి క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. గ్రూపులకు తావు లేకుండా కార్యకర్తలు ఐక్యంగా ఉండి తన గెలుపుకు కృషి చేయాలని కోరారు. అంతకు ముందు ఇందన్ పెల్లి హనుమన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మొదటిసారిగా పార్టీ సమావేశానికి వచ్చిన ఆయనను పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.

ఈ సమావేశంలో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనర్ధన్ రాథోడ్, బీఆర్ఎస్ స్టేట్ సెక్రెటరీ లోక భూమారెడ్డి, నియోజకవర్గ సీనియర్ నాయకుడు పైడిపెల్లి రవిందర్ రావు, జన్నారం, కడెం ఎంపీపీలు మాదాడి సరోజన, అలెగ్జాండర్, జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజారాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి సులువ జనర్ధన్, మార్కెట్ కమిటీ చైర్మన్ సీపతి పద్మ, మండల పరిధిలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed