- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జన్నారం అటవీ డివిజన్ కార్యాలయం ఫర్నిచర్ సీజ్
దిశ,జన్నారం : కవ్వాల టైగర్ రిజర్వులోని జన్నారం అటవీ డివిజన్ కార్యాలయంలోని ఫర్నిచర్ ను శుక్రవారం గోదావరిఖని లేబర్ కోర్ట్ ఆదేశాల మేరకు లక్షెట్టిపేట కోర్టు అధికారులు సీజ్ చేశారు. జన్నారం డివిజన్ కార్యాలయంలో ఎనిమల్ ట్రాకర్ గా విధులు నిర్వహిస్తున్న బియ్యాల రాజా లింగన్నను అటవీ శాఖ డివిజన్ అధికారులు గతంలో విధుల నుండి తొలగించడంతో తాను నష్టపోయానని గోదావరిఖని లేబర్ కోర్టును ఆశ్రయించారు.
దాంతో లేబర్ కోర్టు ఆయన్ని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని జన్నారం అటవీ డివిజన్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ వారు నిర్లక్ష్యం వహించడంతో రాజలింగన్న మళ్లీ కోర్టును ఆశ్రయించారు. దాంతో జన్నారం అటవీ డివిజన్ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, తాళ్ల పేట అటవీ రేంజ్ ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ ను సీజ్ చేయాలని కోర్టు సిబ్బంది ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు దాదాపు పది లక్షల విలువగల ఫర్నిచర్ ను సీజ్ చేసి కోర్టుకు తరలించారు.