జంగుబాయి ఉత్సవాలను విజయవంతం చేయాలి

by Sridhar Babu |
జంగుబాయి ఉత్సవాలను విజయవంతం చేయాలి
X

దిశ, ఉట్నూర్ : ఆదివాసీల ఆరాధ్య దైవం రాయితాడ్ జంగుబాయి ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ, జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం హైదరాబాద్ ప్రజా భవన్లో జంగుబాయి దేవస్థానం నిర్వహణ కమిటీ సభ్యులు, ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ పుష్యమాసాన్ని పురస్కరించుకొని ఆదివాసీలు ఎంతో భక్తి శ్రద్దలతో, నియమనిష్టలతో పవిత్రతో రాయితాడ్ జంగుబాయి దేవతను ప్రతి ఏడాది దర్శించుకుంటారని తెలిపారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కోటపరండోలి గ్రామంలో జంగుబాయి ఉత్సవాలు జనవరి 2 నుండి ప్రారంభమవుతాయని, ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జంగుబాయి దేవస్థానం చైర్మన్ శ్యాంరావు, గౌరవ అధ్యక్షుడు కొడప జాకు, సలహాదారులు మరప బాజీరావ్, సమన్వయకర్తలు తుమ్రం ప్రభ, వెట్టి భూమేష్, దొడంద మాజీ సర్పంచ్ తుమ్రం నాగు, రామారావ్ కటోడ, తుడుందెబ్బ రాష్ట్ర నాయకుడు కొడప నగేష్, పుర్క బాపురావ్, మల్కు పటేల్, ఆదివాసీ పెద్దలు, ఆదివాసీ వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed