Flood Effect : గర్భిణీలకు తప్పని జలగండం.. నాటు పడవల్లో తరలింపు

by Aamani |
Flood Effect : గర్భిణీలకు తప్పని జలగండం.. నాటు పడవల్లో  తరలింపు
X

దిశ,బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గర్భిణీలకు జలగండం తప్పడం లేదు. బెజ్జూరు మండలంలోని ప్రాణహిత నది ఉప్పొంగి పరవళ్లు తొక్కుతుండడంతో బెజ్జూర్ మండలంలోని తలాయి, తిక్క పల్లి భీమరం గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. గురువారం సాయంత్రం తలాయి గ్రామానికి చెందిన లంగారి మేఘన, లంగారి లావణ్యలు 9 నెలలు నిండడంతో గర్భిణీ స్త్రీలను తలై గ్రామం నుంచి తల్లి గారి ఇంటికి తరలించారు. తలై గ్రామం నుంచి నాటు పడవలో బెజ్జూర్ మండలానికి తరలించారు.

గర్భిణీలైన తల్లి గారిల్లు దహెగం మండలంలోని రాస్పల్లి, ఒడ్డు గూడ గ్రామాలకు తరలించారు. ప్రాణహిత నది ఉప్పొంగడం గర్భిణీలకు జలగడం తప్పడం లేదని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేశారు. తలై గ్రామం జలదిగ్బంధంలో ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందని తల్లిగారింటికి గర్భిణీలను తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. బెజ్జూరు తాసీల్దార్ భూమేశ్వర్ ఆదేశాల మేరకు తలై గ్రామంలో ఉంటే వైద్యం అందే పరిస్థితి లేదని వెంటనే గర్భిణీలను తరలించాలని ఆదేశించడంతో వైద్య సిబ్బంది తల్లి గారి ఇంటికి తరలించారు.



Next Story