- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీఎం కార్యాలయం ఎదుట నిరవధిక రిలే దీక్ష..
దిశ, నస్పూర్ : అకారణంగా విధుల నుండి తొలగించిన కన్వేయన్స్ డ్రైవర్ ని వెంటనే విధులలోకి తీసుకోవాలని నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట గురువారం కన్వెయన్స్ డ్రైవర్లు సీఐటీయూ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక రిలే దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐటీయు బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియాలో హుస్సేన్ అనే కన్వేయన్స్ డ్రైవర్ ని అకారణంగా విధుల నుండి తొలగించినందుకు, మద్దతుగా నిరసన తెలిపిన కార్మికులపై, యూనియన్ నాయకుల పై క్వాలిటీ జీఎం అల్లి రాజేశ్వర్ అధికార బలంతో అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు.
ఒక సంస్థకు సంబంధించిన విషయాన్ని వ్యక్తిగత ధోరణితో పోతూ, అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్న క్వాలిటీ జీఎం పైన సింగరేణి యాజమాన్యం పూర్తిస్థాయిలో విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే విధుల నుండి తొలగించిన కార్మికుడిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. లేనిచో ఈ పోరాటాన్ని సింగరేణి వ్యాప్తంగా పెద్దఎత్తున ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అక్రమంగా పెట్టిన కేసులకు వ్యతిరేకంగా శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం రిలే దీక్ష నుండి సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి క్వాలిటీ జీఎం పై కన్వేయన్స్ డ్రైవర్లు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కన్వేయన్స్ డ్రైవర్ల యూనియన్ సీఐటీయు డివిజన్ అధ్యక్షుడు పెండం శివ, కార్యదర్శి బండి తిరుపతి, డ్రైవర్లు హుస్సేన్, సతీష్, శ్రీకాంత్, అఖిల్, వినోద్, లక్ష్మణ్, విద్యాసాగర్, మహేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.