- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖానాపూర్ బరిలో ఐఏఎస్ శర్మన్..!
దిశ ప్రతినిధి, నిర్మల్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు హైదరాబాద్ మాజీ కలెక్టర్ శర్మన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ నియోజకవర్గంలోని జన్నారం మండలానికి చెందిన శర్మన్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆ దిశగా ఆయన నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు. గత మూడు నెలల క్రితమే రిటైర్డ్ అయిన ఆయన అధికార భారత రాష్ట్ర సమితిలో చేరాలని ముందుగా ఆలోచన చేశారు. అయితే నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులతో పాటు భవిష్యత్తులో అన్ని వర్గాలను ఏకం చేయవచ్చన్న ఆలోచనతో ఆయన ఆ పార్టీలో చేరేందుకు సుముఖత చూపడం లేదని సమాచారం.
ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో క్రమంగా వేళ్ళూనుకుంటున్న బహుజన సమాజ్ పార్టీలో చేరి అన్ని వర్గాలను ఏకం చేసే యోచనలో శర్మన్ పడినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన నియోజకవర్గంలో పండగలు పబ్బాలకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఫ్లెక్సీలో అంబేద్కర్ జ్యోతిబాపూలే కొమరం భీమ్ వంటి ఆదర్శనీయుల ఫోటోలు పెట్టి తన రాజకీయ అరంగేట్రం అంశాన్ని నియోజకవర్గ ప్రజలకు చేరువ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడే రాజకీయ పార్టీని ప్రకటించకుండా మరో మూడు నెలల పాటు ప్రజల్లోకి వెళ్లి ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని శర్మన్ ప్రకటిస్తారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.