- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన..
దిశ, రామకృష్ణాపూర్ : పేదవాడికి ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో బాల్కఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్గనైజర్ పుల్లూరి సుధాకర్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆదివారం రామకృష్ణాపూర్ సింగరేణి క్లబ్ లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని పురపాలక చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, బwఆర్ఎస్ పార్టీ పట్టణ ఇంచార్జి గాండ్ల సమ్మయ్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్క ఫౌండేషన్ ప్రతి నిరుపేద కుటుంబానికి వైద్యం అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు.
ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉచితవైద్య శిభిరంలో కరీంనగర్ అపోలో రీచ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ ప్రమోద్ గుప్తా, మంచిర్యాల మెడికల్ హాస్పిటల్ డాక్టర్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం బాగుంటుందని ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 800 మంది రోగులకు గుండె, మూత్ర కోశ, నరాల, దంత, ఎముకల, గైనకాలజి సంబంధిత రోగులకు జనరల్ సర్జన్, జనరల్ ఫిజీషియన్ వైద్యులు వైద్య సేవలు అందించి సలహా ఇచ్చారని, అలాగే ఈసీజీ, రక్త పరీక్షలు, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి 4.5 లక్షల విలువగల మందులను పంపిణీ చేసినట్లు తెలిపారు.
వికలాంగురాలు వద్దకే వైద్య సేవలు..
బాల్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన వికలాంగురాలి మూడు చక్రాల సైకిల్ వద్దకే వచ్చి సుబ్బారెడ్డి అనే వైద్యుడు సేవలు అందించడం పలువురిని అబ్బరపరిచాయి. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు యాకుబ్ ఆలి, కౌన్సిలర్ లు జాడి శ్రీనివాస్, రేవెల్లి ఓదెలు, విజయ, అనిల్ రావు, మహేష్, శ్రీలత, సంపత్, రాజు, మాజీ జెడ్పీటీసీ వాసాల రాజయ్య, మాజీ ఎంపీటీసీ పుల్లూరు కళ్యాణ్, అంజనిపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ గుర్రాల శ్రీధర్, డైరెక్టర్ పిల్లి రవి, బీఆర్ఎస్ నాయకులు సత్యపాల్, రాజేష్, రామిడి కుమార్ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.