కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు..

by Sumithra |
కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు..
X

దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మరోసారి కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనల మేరకు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టే ప్రక్రియలో భాగంగా పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలను గ్రూపుల వారిగా నిర్వహించారు.

ఒకవైపు పీసీసీ సభ్యులు నూకల రమేష్ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద దిష్టిబొమ్మ దహనం చేయగా, యువ నాయకులు చెన్నూరి శ్రీధర్ ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన వీధుల గుండా శవయాత్ర నిర్వహించి అంబేద్కర్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం చేశారు. నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేకపోవడంతో ఎవరికి వారు యమునా తీరు అన్నట్లు ఎవరికి తోచిన విధంగా వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కనీసం ఎన్నికల సమయంలోనైనా ఈ గ్రూపు నాయకులందరూ ఒకే తాటిపైకి వచ్చేనా, అని నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు.

Advertisement

Next Story