- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పరద చాటున అక్రమ నిర్మాణాలు
దిశ, నస్పూర్: నస్పూర్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, రియల్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. నస్పూర్ శివారులోని సర్వే నెంబర్ 42,64,119 లలోని ప్రభుత్వ భూములను అధికారుల అండదండలతో కబ్జాదారులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. నస్పూర్ శివారులోని సర్వే నెంబర్ 42 ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న ఓ ఇంటిని స్థానిక ప్రజల సమాచారం మేరకు ప్రభుత్వ అధికారులు కూల్చివేశారు. కానీ కొంతకాలానికి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే దారిలో మళ్లీ అదే స్థలంలో ప్రజల కంటపడకుండా చుట్టూ పరదాలు కట్టి అక్రమంగా కొత్త ఇంటిని నిర్మిస్తున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.
ఇటీవల కబ్జాదారులు సర్వే నెంబర్ 119 లో కొంత భూమిని ఆక్రమించుకోవడానికి ఫెన్సింగ్ వేయడంతో అదనపు కలెక్టర్ వచ్చి తొలగించారు. అలాగే సర్వే నెంబర్ 64 అసైన్డ్ భూముల్లో రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో నస్పూర్ పట్టణం ఉండడంతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయి భూ అక్రమణదారులు రూ. కోట్లకు పడగలెత్తుతున్నారని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణలవైపు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానిక ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ కట్టడదారులపై, భూ అక్రమణదారులపై తగు చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు కోరుతున్నారు.