ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంది : ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.

by Shiva |
ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంది : ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.
X

దిశ, నస్పూర్ : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. శుక్రవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి, విలేజ్ నస్పూర్ లలో వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులందరూ దళారులను నమ్మి మోసపోకుండా సొసైటీ ఆధ్వర్యంలో ప్రారంభించిన రైతు కొనుగోలు కేంద్రాలనే ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ సందెల వెంకటేష్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అక్కురి సుబ్బయ్య, కౌన్సిలర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story