పంట నష్టంపై సమగ్ర నివేదికనివ్వండి : కలెక్టర్ వరుణ్ రెడ్డి

by Shiva |
పంట నష్టంపై సమగ్ర నివేదికనివ్వండి : కలెక్టర్ వరుణ్ రెడ్డి
X

దిశ, కడం: పంట నష్టంపై సమగ్ర నివేదికనివ్వాలంటూ కలెక్టర్ వరుణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి నష్టపోయిన పంటలను నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్, లింగాపూర్ గ్రామాల్లో గత నాలుగు రోజుల క్రితం కురిసినకాల వర్షానికి నష్టపోయిన మామిడి పంటలు, వరి ధాన్యం పొలాల పంటలను జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. పంట నష్టంపై సమగ్ర నివేదకనివ్వాలంటూ జిల్లా వ్యవసాయ ఆర్టికల్చర్ అధికారులను ఆదేశించారు.

అనంతరం లింగాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్య సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నర్సరీని, వర్మి కంపోస్టు, పార్కులను సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అలెగ్జాండర్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎమ్మార్వో చిన్నయ్య, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీవో వెంకటేష్, సర్పంచ్ లు బొడ్డు గంగన్న, ఆకుల బాలవ్వ, నాయకులు ఆకుల లచ్చన్న, బొంగు వెంకన్న, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story