డెంగ్యూ జ్వరంతో బాలిక మృతి

by Sridhar Babu |
డెంగ్యూ జ్వరంతో బాలిక మృతి
X

దిశ, బెజ్జూర్ : సిర్పూర్ (టీ)మండలంలోని వెంకట్రావు పేట్ గ్రామానికి చెందిన దంద్రే కుషాబ్ రావ్, తిషాల దంపతులకు చెందిన దంద్రే గంగోత్రి (16) సోమవారం రాత్రి డెంగ్యూ జ్వరం రావడంతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. డెంగ్యూ జ్వరాల పై వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్వరాలు రావడానికి కారణం పారిశుద్ధ్య లోపమా.. వైద్య అధికారులు ప్రజలకు అవగాహన కనిపించకపోవడమా అనే ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో అధికారులు పనిచేయకపోవడంతో పాటు ప్రజలకు అవగాహన లేకపోవడం వల్లనే జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు జ్వరాలపై అవగాహన కల్పించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story