ప్రశాంతంగా గణేష్ నిమజ్జనోత్సవాలు నిర్వహించాలి

by Sridhar Babu |
ప్రశాంతంగా గణేష్ నిమజ్జనోత్సవాలు నిర్వహించాలి
X

దిశ, ఆదిలాబాద్ : జిల్లాలో ఈనెల 7న ప్రతిష్టించిన వినాయక విగ్రహాలను ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేయాలని, అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గణేష్ కమిటీ మెంబర్లు, గణేశ్ మండపాల నిర్వాహకులు, సంబంధిత అధికారులతో వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి, కమిటీ సభ్యుల సమస్యలను అడిగి తెలుసుకున్న అనంతరం అధికారులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.

ఉత్సవ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ దృష్టికి పలు సమస్యలను తీసుకువెళ్లగా జిల్లాలోని తిలక్ నగర్, క్రాంతి నగర్, మహాలక్ష్మి వాడ, తదితర చోట్ల రోడ్లు సరిగా లేవని, తాత్కాలిక మరమ్మతులు చేయించాలని, పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని, నక్షత్ర ఆసుపత్రి నుండి నటరాజ్ థియేటర్ తదితర చోట్ల అడ్డంగా ఉన్న కరెంట్, జియో తీగలను తొలగించాలని, మున్సిపాలిటీ ద్వారా అడ్డంగా ఉన్న చెట్లను, కొమ్మలను తొలగించి రాకపోకలకు అంతరాయం కలగకుండా చూడాలని కోరారు. అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, అశోక్ చౌక్ లలో నిమజ్జనం రోజు తాగునీటిని ఏర్పాటు చేయాలని, మండపాల వద్ద హెల్ప్ లైన్ నెంబర్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కోరారు.

భారీ విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్ల ను అందుబాటులో ఉంచాలని, తగిన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, గజ ఈత గాళ్లను సిద్ధంగా ఉంచాలని కోరారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, ట్రైనీ కలెక్టర్ అభి గ్యాన్, ఆర్డీవో వినోద్ కుమార్, తహసీల్దార్, విద్యుత్, మున్సిపల్, ఆర్ అండ్ బీ, అగ్నిమాపక, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు, గణేశ్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. మున్సిపల్ శాఖకు సంబంధించిన ఫోన్ నెంబర్ 9492164153కి కాల్ చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed