- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న మాజీ సుప్రీం జడ్జి
X
దిశ, బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఎన్ వి రమణ నవరాత్రుల సందర్భంగా కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో తన మనమరాలైన శ్రీ నిత్యకు వేదిక బృందం సభ్యుల ఆధ్వర్యంలో అక్షర శ్రీకర పూజలు నిర్వహించారు. ఆదివారం రాత్రికి బాసరకు చేరుకున్న మాజీ జడ్జి కుటుంబ సమేతంగా ఆలయ అతిథి గృహంలో బస చేశారు. ఉదయం ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు ఆలయ ఈవో విజయ రామారావు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ పాటక్, స్థానాచార్యులు సంజీవ్ మహారాజ్, వేద పండితులు నవీన్ శర్మ అక్షర శ్రీకార పూజలు, సహస్ర కుంకుమార్చన అర్చన నిర్వహించారు.
Advertisement
Next Story