Minister Seethakka : కొత్త నల్లా కనెక్షన్లకు పెండింగ్ దరఖాస్తులు లేవు : మంత్రి సీతక్క

by Y. Venkata Narasimha Reddy |
Minister Seethakka : కొత్త నల్లా కనెక్షన్లకు పెండింగ్ దరఖాస్తులు లేవు : మంత్రి సీతక్క
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కొత్త నల్లా కనెక్షన్ల(Nalla connections) కోసం పెండింగ్ లో ఎలాంటి దరఖాస్తులు లేవని మంత్రి సీతక్క(Minister Seethakka) వెల్లడించారు. తాగు నీటి నల్లా కనెక్షన్లకు సంబంధించి మండలిలో ఎమ్మెల్సీలు టి.జీవన్ రెడ్డి, తక్కెన పల్లి రవీందర్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. 2021 వరకు 53 లక్షల 98 వేల ఇళ్లకు 100 శాతం తాగునీరు అందుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జూన్, జులై లో గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటి సర్వే చేసి నల్లా కనెక్షన్ల డిమాండ్ ను గుర్తించామని తెలిపారు. సర్వేలో 4 లక్షల 49 వేల ఇళ్లకు తాగునీరు నల్లా కనెక్షన్లు లేవనీ గుర్తించడం జరిగిందన్నారు. 3 లక్షల 21 వేల ఇళ్లకు ప్రభుత్వం నల్లా కనెక్షన్ల ఏర్పాటు పూర్తి చేసిందని తెలిపారు. ఇంకా 1లక్షా 28 వేల ఇళ్లకు తాగునీరు నల్లా కనెక్షన్లు అందించాల్సిన అవసరముందని తెలిపారు.

12,791బోర్లను, 7227సింగిల్ ఫేస్ మోటార్లను, 5,946పీడబ్ల్యుఎస్ స్కీమ్ ల మరమ్మతులు జరిపించామని తెలిపారు. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకంతో గొప్పగా నీళ్లు అందించిందని చెప్పుకున్నప్పటికి ఇంకా అనేక లక్షల ఇండ్లకు మంచినీటీ సరఫరా జరుగలేదన్నారు.అందుకే మా ప్రభుత్వం ఉట్నూరు పరిధిలో 60కోట్లు, గజ్వేల్, భువనగిరి కోసం 210కోట్లు, సిద్ధిపేటకు కూడా 3కోట్లు మంజూరు చేశామన్నారు. మెయింటనెన్స్ 469కోట్లు పెండింగ్ లో పెట్టిందని చురకలేశారు. రక్షిత మంచినీటీ సరఫరా పథకం నీటినే ప్రజలు వినియోగించేలా చూస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed