Naga Chaitanya : నాగచైతన్య, శోభితకు అలాంటి కండిషన్ పెట్టి పెళ్లి చేసుకున్నాడా?

by Prasanna |
Naga Chaitanya : నాగచైతన్య, శోభితకు అలాంటి కండిషన్ పెట్టి పెళ్లి చేసుకున్నాడా?
X

దిశ, వెబ్ డెస్క్ : నాగచైతన్య ( Naga Chaitanya ) , శోభిత ( Sobhita Dhulipala) పెళ్లి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ లవ్ బర్డ్స్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వారి గురించి ఎన్నో విషయాలు అభిమానులతో పంచుకున్నారు. అయితే, చైతు ఓ విషయంలో శోభితకి సీరియస్ కండిషన్ పెట్టినట్టు తెలుస్తుంది.

నాగచైతన్య తెలుగింటి అబ్బాయి అయినా పుట్టి పెరిగింది మొత్తం చెన్నైలో కావడం వలన ఇంగ్లీష్ , తమిళ్ బాగా అలవాటు అయిందట. తెలుగులో మాట్లాడేటప్పుడు తప్పులు పోతాయట. సినీ ఇండస్ట్రీలో వివిధ భాషలకు సంబంధించిన నటీనటులను కలుస్తుండటంతో తెలుగు, ఇంగ్లీష్ కలిపి మాట్లాడేవాడట. కానీ, తనకు తెలుగు మాట్లాడే వాళ్ళంటే ఇష్టమని చెప్పాడు.

అలా శోభిత కూడా తెలుగమ్మాయి అవ్వడంతో తనతో కేవలం తెలుగులోనే మాట్లాడాలని కండిషన్ పెట్టాడట. తను కలిసినప్పుడు తెలుగులోనే మాట్లాడవా అని శోభితను అడిగేవాడిని, అలా నాకు కూడా తెలుగు బాగా అలవాటు అవుతుందని కదా అని చెప్పానంటూ చైతూ తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed