అలక వీడారు.. తిరిగి కాంగ్రెస్‌లో చేరిన ఆ మాజీ నేతలు

by Nagaya |   ( Updated:2024-04-30 14:14:42.0  )
అలక వీడారు.. తిరిగి కాంగ్రెస్‌లో చేరిన ఆ మాజీ నేతలు
X

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీని వీడిన ముగ్గురు సీనియ‌ర్ నేత‌లు తిరిగి ఆ పార్టీ గూటికి చేరుకున్నారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టీపీసీసీ ప్రధాన‌కార్యదర్శిగా ప‌నిచేసిన గండ్రత్ సుజాత, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ రెడ్డి తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంగ‌ళ‌వారం గాంధీ భవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ‌తంలో ఆదిలాబాద్ టిక్కెట్టు కొత్తగా వచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డికి కేటాయించారు. దీనిపై అల‌క‌వ‌హించిన ఈ నేత‌లు రాజీనామా చేశారు. వారిని పార్టీలో తీసుకునే అవ‌కాశం ఉంద‌ని భావించిన ఓ నేత‌ వారిని ఆరేండ్ల పాటు స‌స్పెండ్ చేయించారు. అయితే, తాజాగా వారు కాంగ్రెస్ పార్టీలో చేర‌డంతో ఆదిలాబాద్‌లో తిరిగి ఆ పార్టీ బ‌లోపేతం అవుతుంద‌ని భావిస్తున్నారు.

Read More...

ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నావ్.. కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్

Advertisement

Next Story