- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పాఠశాలల్లో విద్యార్థులకు అస్వస్థత.. హెడ్మాస్టర్‌లు సస్పెండ్
దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా కేజీబీవీ హాస్టల్‌లో మరో 15 మంది విద్యార్థులకు వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో బుధవారం టిఫిన్ తిన్న 30 మంది విద్యార్థులు, అలాగే తాంసీ మండలం గోట్ కూరి యూపీపీఎసీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 28 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.. ఈ ఘటన మరవకముందే తాజాగా.. కేజీబీవీలో మరో 15 మంది విద్యార్థులకు కడుపు నొప్పి, వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది హుటాహుటిన రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత రిమ్స్ కు చేరుకొని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ రిమ్స్ కు చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆహార నియంత్రణ అధికారులు ఫుడ్ శాంపుల్ సేకరించి ల్యాబ్ కు తరలించారు. కేజీబీవీలోని ఎస్ ఓ, ఏఎన్ఎంలతోపాటు యూపీపీఎస్ పాఠశాల హెడ్మాస్టర్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.