కేంద్ర ప్రభుత్వం పై మహిళలు శంఖారావం పూరించాలి..

by Sumithra |
కేంద్ర ప్రభుత్వం పై మహిళలు శంఖారావం పూరించాలి..
X

దిశ, బెల్లంపల్లి : కేంద్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమ రంగాలన్నిటిని ప్రైవేటు శక్తులకు అప్పగించడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని మాజీ మంత్రి, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. కాంటా చౌరస్తా వద్ద వంటగ్యాస్ ధరల పెరుగుదలపై శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి, రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ వేణుగోపాల చారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ ఓ పక్క రాముడీ పేరుతో, మరో మరోపక్క ప్రైవేటి కరణతో సంక్షేమ రంగాలను నిర్వీర్యం చేయడాన్ని విమర్శించారు.

సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థను పరిరక్షించేందుకు ప్రయత్నిస్తుంటే బీజేపీ ప్రభుత్వం అంబానీ ఆదానీలకు అమ్మాలని చూస్తున్నదని విమర్శించారు. ఇప్పటికే సింగరేణిలో కొన్ని బ్లాకులను అమ్మడానికి టెండర్లు వేశారని తెలిపారు. అంతటితో ఆగకుండా ప్రజాసంక్షేమ రంగాలు కూడా విడిచి పెట్టడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలతో సామాన్యుల జీవితం దినదిన గండంగా మారుతున్నదని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యత్రిక పాలన పై మహిళలు పోరాట శంఖారావాన్ని పూరించాలని పిలుపునిచ్చారు. గ్యాస్ ధరలు పెరగడం పై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని అన్నారు.

అనంతరం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ 2014 నుంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తరచుగా పెంచుతూ కేంద్రప్రభుత్వం పేదప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నదని విమర్శించారు. ఉన్నట్టుండి గ్యాస్ ధరలు పెంచడం పై కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెంచర్ గ్యాస్ ధరలు పై మహిళలు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. గ్యాస్ ధరలపై బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు.

బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరణి పెంచిప్రజల ఉసురు తీస్తున్నదని వాపోయారు. ప్రజావ్యతిరేక కేంద్రప్రభుత్వం మెడలు వంచి ధరలను తగ్గించుకోవాలన్నారు. మోడీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ సందర్భంగా మహిళలు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి రోడ్డు పై పెరిగిన గ్యాస్ ధరలకు నిరసనగా కట్టెల పొయ్యి పై వంట చేసే నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, జడ్పీవైస్ చైర్మన్ సత్యనారాయణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నిరంజన్ గుప్తా, మున్సిపల్ కౌన్సిలర్లు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed