- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వాతంత్రం వచ్చినా వారి బతుకులు ఇంతేనా..
దిశ, బజార్హత్నూర్ : మండలంలోని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మోహద గ్రామానికి గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్, బీజేపీ మండల పార్టీ శ్రేణులు వెళ్లాయి. మొదట గ్రామంలోని వీధులన్నీ తిరుగుతూ ఆ గ్రామంలోని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మోహద గ్రామంలో సీసీ రోడ్లు గాని, డ్రైనేజీ వ్యవస్థ గాని, పక్కా ఇల్లు గాని ఇంతవరకు నిర్మాణం జరగలేదని అన్నారు.
గ్రామ ప్రజలతో సమావేశమై వారి సమస్యలన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకొని సమస్యల పరిష్కారానికి బీజేపీ పార్టీ తరఫున మా వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు బత్తిని సుధాకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు పోరెడ్డి శ్రీనివాస్, గోకొండ సర్పంచ్ రుక్మిణీ జంగు, చింతల్ సాంగ్వి సర్పంచ్ మడవి ప్రకాష్, పీఎసీఎస్ డైరెక్టర్స్ వినీల్ కుమార్, అడే సంతోష్, షేర్ సింగ్, మేకల లింగన్న, ప్రధాన కార్యదర్శులు పెరుగు సంతోష్, జాడి బాలిరాం, ముఖ్యనాయకులు ఆత్రం గోపాల్, గ్రామ పటేల్ సిడం బిక్కు, పూజారి తోడసం సీతారాం, మహాజన్ మెస్రం నాగరవు, గ్రామ పెద్దలు కొమరం జైతు, తొడసం నగరవు, కుడిమేత మాన్కు, సిడం లింగారవు కొమరం భీం యూత్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.