- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
హై టెన్షన్ బ్రతుకులు, గాల్లో ప్రాణాలు..
by Sumithra |
X
దిశ, తలమడుగు : తలమడుగు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గల ఇండ్ల మీది నుండి విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కొనసాగుతున్నాయి. దీంతో స్థానికులు ఎప్పుడు ఎక్కడ నుండి విద్యుత్ ప్రమాదం ముంచుకొస్తుందో అని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇంటి పై కప్పును తాకెలా ఉన్న వైర్లను చూసి భయబ్రాంతులకు గురి అవుతున్నారు.
ముఖ్యంగా వర్షం పడినప్పుడు, ఈదురు గాలులు వచ్చినప్పుడు విద్యుత్ హెచ్చుతగ్గుల వల్ల ఎప్పుడు ఏమవుతుందో అని అర చేతిలో ప్రాణాలు పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రమాదం జరిగి ఏదైనా సంఘటన జరిగితే గాని పట్టించుకోరేమో. కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు స్థానికులు. ఇకనైనా విద్యుత్ శాఖ అధికారులు సమస్యను పరిష్కరించగలరని వేడుకుంటున్నారు.
Advertisement
Next Story