- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బెల్లంపల్లిలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
దిశ, బెల్లంపల్లి : రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ప్రసారాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. బుధవారం మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఆఫీసు ప్రధాన కూడలి వద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. 24 గంటల విద్యుత్ కు బదులు మూడు గంటలు సరిపోతుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉచితంగా సౌలభ్యంగా కొనసాగుతున్న
విద్యుత్ సరఫరాను రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేక అభివృద్ధి నిరోధకంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నాయకుడు, జెడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోవడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read more: కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ ధర్నాలు.. స్టేట్‌లో పొలిటికల్ హీట్!